ఫలానా వాళ్ళ కుటుంబంలో అమ్మాయిని ఇస్తున్నామంటే…మన ఆరాలు మనకి ఉండాలిగా. అబ్బాయి ఎలాంటి వాడో..ఏంటో ?! సిగరెట్టు గట్రా..తాగితే! తాగుడు జూదం…వగైరా అలవాట్లుంటే ఏంటి పరిస్థితి..?! ఇవన్నీ అమ్మాయి తరుపువాళ్ళకు అబ్బాయి మీద ఉండే అపోహలు.అమ్మాయి కాపురానికి వెళ్ళి అసలూ నకిలీ కనిపెట్టేదాకా ఇలాంటి అనుమానాలతోనే పెళ్ళితంతు నుంచి మనుగుడుపు వరకూ జరిగిపోతాయి.
ఫైనల్ గా… అమ్మాయి ఆరాతీసిన మేరకు అబ్బాయికి అన్ని అలవాట్లూ ఉన్నాయి.అంతే..! కన్నవాళ్ళ గుండెబద్దలు..ఆలూమగల మధ్యలో గొడవలు మొదలు …ఇవన్నీ అవసరమా అనుకున్నారు.
ఆ ఆడపెళ్ళివాళ్ళు.
ఇలాంటివన్నీ ఈరోజుల్లో క్వైట్ కామన్ అని ప్రాక్టికల్ గా ఆలోచించారు. మనమే ఒక సిగెరెట్టు వెలిగించి అల్లుడి నోట్లో పెడితే పోలా అనుకున్నారు. అనుకున్నట్టుగానే చేసారు. పెండ్లి వేడుకలో వరుడి వీడియో (viral video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడికి సిగరెట్ వెలిగించి పెండ్లి వేడుకకు వధువు తల్లితండ్రులు ఆహ్వానిస్తున్న వీడియో నెట్టింట ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
బ్లాగర్ జుహీ కే పటేల్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 57 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోలో వరుడు కూర్చుని ఉండగా అత్తా మామలు అతడికి సిగరెట్ అందించి వారే వెలిగించడం కనిపిస్తుంది.
ఈ పెండ్లి వేడుకకు అతిధిగా హాజరైన జుహీ ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు. పెండ్లి కొడుకును స్వీట్లు, బీడీ, పాన్‌తో అత్తగారు స్వాగతించిన పెండ్లి వేడుకను ఇప్పుడే చూశానని ఆమె రాసుకొచ్చారు.
దక్షిణ గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లో అనుసరించే పాత సంప్రదాయం ఇదని, అతడు కనీసం పొగతాగలేదని, వీడియోలో వారు కేవలం ఆచారం కోసం నటించారని చెప్పుకొచ్చారు. ఈ ఆచారంపై నెటిజన్లు పెదవివిరిచారు. అసలు ఇదేం సంప్రదాయమని మరికొందరు నొసలు చిట్లించారు. అయితే బిహార్, ఒడిషాలోనూ ఇలాంటి సంప్రదాయం ఉందని మరికొందరు యూజర్లు కామెంట్ చేశారు.