రాష్ట్ర బడ్జెట్‌ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు. రూ.2.9 లక్షల కోట్లతో ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టిందని, కానీ ఆదాయం మాత్రం రూ. 1.30 లక్షల కోట్లు అని చూపడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
మన్నెగూడలో నిర్వహించిన బీజేపీ కార్నర్ మీటింగ్ వర్క్షాప్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. దీంతో పాటు టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు.
ప్రభుత్వానికి లిక్కర్ ఆదాయమే రూ. 40వేల కోట్లు వస్తోందని, సంక్షేమ పథకాలకు కనీసం రూ.230వేల కోట్లను కూడా కేసీఆ్ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్నర్ మీటింగ్ ల ద్వారా ఇంటింటికీ బీజేపీని చేరువ చేయాలని పిలుపు నిచ్చారు.
రూ.2.9 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఆదాయం మాత్రం రూ. 1.30 లక్షల కోట్లు అని చూపడం విడ్డూరంగా ఉందని చెప్పారు. మిగిలిన ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో ప్రభుత్వం ఎందుకు చెప్పడంలేదని ఆయన ప్రశ్నించారు. లిక్కర్ అమ్మకాలు, భూముల విక్రయాలు, పన్నులు, ఛార్జీలు పెంచడం ద్వారా ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలనుకుంటోందని ఆయన మండిపడ్డారు.