కోవిడ్ – 19 వ్యాక్సిన్ వేయించుకుటన్న బ్రిటన్ రాణి దంపతులుబ్రిటన్ క్వీన్ ఎలిజబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ దంపతులు కోవిడ్ -19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. వారి ఫ్యామిలీ డాక్టర్ విండ్‌సోర్ ఇరువురికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ మేరకు బకింగ్‌హమ్ ప్యాలెస్ ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఎలిజిబెత్ వయస్సు 94 ఏళ్లు కాగా.. ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్‌కు 99 ఏళ్లు.
లాక్‌డౌన్ సమయంలో ఎలిజబెత్ దంపతుల పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా వైరస్ సోకింది. ఆతర్వాత వారి మనువడు ఈ మహమ్మారి బారినపడ్డారు. లాక్‌డౌన్ సమయంలో దంపతులిద్దరూ బకింగ్ హామ్ ప్యాలెస్‌లోనే ఉన్నారు. మార్చి నుంచి అక్టోబర్ వరకు కాలు బయటపెట్టలేదు. ఇటీవలే గత నెలలో రాయల్ ఫ్యామిలీ సినియర్ సభ్యులతో క్వీన్ ఎలిజబెత్ సమావేశమయ్యారు.