బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్.. వయస్సు 94 ఏళ్లు.. ఇప్పటికి ఆమె తన 70 ఏళ్ల పాలన సమయంలో ఎన్నో దేశాలు తిరిగారు. దాదాపుగా 116 దేశాలను ఆమె ఇప్పటి వరకు సందర్శించారు. అయితే అన్ని దేశాలను సందర్శించినా.. తన భర్త.. డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ ప్రిన్స్ ఫిలిప్‌కు చెందిన సొంత దేశం గ్రీస్‌ను మాత్రం ఇప్పటి వరకు ఆమె సందర్శించలేదు. అవును.. వినేందుకు ఇది చాలా చిత్రంగా ఉన్నా.. ఇది నిజమే.
అయితే క్వీన్ ఎలిజబెత్ తన భర్త ఫిలిప్ మాతృదేశాన్ని సందర్శించకపోవడానికి బలమైన కారణమే ఉంది. ఫిలిప్ కుటుంబాన్ని గ్రీస్ దేశం ఎప్పుడూ చులకనగా చూసిందట. అందుకనే ఫిలిప్‌కు తన మాతృదేశంపై విపరీతమైన అసహ్యం, ద్వేషం ఉండేవట. అందుకనే క్వీన్ ఎలిజబెత్ కూడా గ్రీస్ దేశాన్ని సందర్శించలేదట.
ఇక క్వీన్ ఎలిజబెత్ వంశంలో చాలా మంది అత్యధిక సంవత్సరాల పాటు జీవించారు. ఆమె తల్లి 101 ఏళ్లు జీవించగా, సోదరి మార్గరెట్ 71 ఏళ్లు జీవించారు. మార్గరెట్ నిజానికి విపరీతంగా పొగతాగేవారు. అయినప్పటికీ ఆమె అన్ని సంవత్సరాలు జీవించారంటే అది గ్రేట్ అని చెప్పవచ్చు. ఇక ఎలిజబెత్ ఆంటీ అలైస్ 102 ఏళ్లు జీవించారు. ఏది ఏమైనా.. రాజ వంశానికి చెందిన వారి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటుంటే.. నిజంగానే మనకు ఆశ్చర్యం వేస్తుంటుంది కదా..!