బ్రిటన్ లో స్మార్ట్ జైలును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అన్ని జైళ్లతో పోలిస్తే భిన్నంగా ఇందులో స్మార్ట్ టెక్నాలజీని అందుబాటులో ఉంచారు. ఇందులో ఖైదీలకు పలు కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
మిగతా జైళ్లలాగా కాకుండా ఇందులో ఖైదీల కోసం జిమ్, స్నూకర్ టేబుల్, టేబుల్ టెన్నిస్, కంప్యూటర్ ట్యాబ్ లెట్ సదుపాయాలను కల్పించారు. వీటిని ఉపయోగించుకుని ఖైదీలు తమ విద్యార్హతలు పెంచుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఖైదీలకు విద్యను నేర్చుకునేందుకు గాను వారి సెల్ లోపల ఇన్-సెల్ టాబ్లెట్‌లను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వీటిని దుర్వినియోగం చేయకుండా చూసేందుకు ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించినట్టు పేర్కొంటున్నారు.
ఇక ఖైదీలు నిషేధిత వస్తువులను తీసుకు వచ్చి వాడకుండా ఉండేందుకు బాడీ స్కానర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఖైదీలకు పలు కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు స్థానిక యజమానులతో ప్రత్యక్ష భాగస్వామ్యంతో పని చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీని ద్వారా సంఘంలోకి తిరిగి వచ్చాక మాజీ నేరస్తులకు వెంటనే రెడీ మేడ్ గా ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. తద్వారా నేరాల సంఖ్యను తగ్గుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది.