ఇంగ్లాండ్ ను కలవరపెడుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు ఇప్పుడు విదేశాలను కూడా వణికిస్తున్నాయి. భారత్ సహా పలు దేశాలన్నీ ఇప్పటికే బ్రిటన్ నుండి వచ్చే విమానాలను రద్దు చేసుకున్నాయి. కానీ గత వారం రోజులుగా వచ్చిన వారి వివరాలను ట్రాక్ చేసే పనిలో ఉన్నాయి.
తాజాగా బ్రిటన్ నుంచి చెన్నై వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఢిల్లీ మీదగా చెన్నై చేరుకున్న ఆ వ్యక్తికి విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ వ్యక్తిని ప్రభుత్వాసుపత్రికి తరలించి, క్వారంటైన్లో ఉంచారు.