అన్ని దేశాలు మనదేశంలా చూసీచూడనట్టుండవ్. బ్రిటీష్ వాళ్ళు స్వాతంత్ర్యం ఇచ్చిన దగ్గర్నుంచి మన ఇష్టానికి ఉంటుంన్నాం. తింటున్నాం. తిరుగుతున్నాం. సామాజి బాధ్యత పూర్తిగా మర్చిపోయాం.ఇక్కడ డబ్బు, అధికారం ఉంటే అన్నీ యదేచ్ఛగా నడుస్తాయి. కానీ కొన్ని దేశాలు అలాక్కాదు.
”రూల్ ఈజ్ రూల్ , రూల్ ఫర్ ఆల్” అనేది ఖచ్చితంగా అమలవుతుంది. బాధ్యతా రాహిత్యానికి భారీ మూల్యం చెల్లించుకున్నాడో వ్యక్తి. ఇంగ్లండులో రోడ్డుమీద సిగరెట్ పీక పడేసినందుకు గవర్నమెంటు దండిగా జరిమానా విధించింది.
ఆ వ్యక్తికి ఏకంగా రూ.55వేలు (558 పౌండ్లు) జరిమానా విధించింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని థోర్న్ బరీ టౌన్‌లో చోటు చేసుకుంది. సంబంధింత వివరాల ప్రకారం. అలెక్స్ డేవిస్ అనే వ్యక్తి.. సిగరెట్ తాగి దాని పీకను రోడ్డుపై పడేశాడు. దీన్ని గమనించిన స్ట్రీట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అలెక్స్ కు రూ.15 వేలు (150 పౌండ్లు) జరిమానా విధించారు.
ఆ మొత్తం వెంటనే కట్టాలని ఆదేశించారు. అయితే, అధికారుల ఆదేశాలను అతను లెక్కచేయలేదు. దీంతో ఆగ్రహించిన అధికారులు అలెక్స్ పై కేసు నమోదు చేసి..కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు విచారించిన న్యాయమూర్తి.. అలెక్స్ కు రూ.55 వేలు జరిమానా విధించారు.
సిగరెట్ తాగి పీకను ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల రోడ్లన్నీ చెత్తగా తయారవుతాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.