టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం లభించింది. ఆయన్ని బ్రిటన్ పార్లమెంట్ సన్మానించింది. ఈ విషయాన్ని దాదా స్వయంగా వెల్లడించారు. బ్రిటన్ పార్లమెంట్ తనను సత్కరించడం గర్వంగా ఉందన్నారు.
బ్రిటన్ పార్లమెంట్ సత్కరించిందుకు గాను ఓ బెంగాలీగా తాను చాలా గర్వపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ సన్మానం గురించి తనను బ్రిటన్ ప్రతినిధులు ఆరు నెలల క్రితమే తనను సంప్రదించినట్టు వివరించారు. ప్రతి ఏడాదీ బ్రిటన్ ఇలా ఒకరిని సన్మానిస్తుందని, ఈ ఏడాది తనకు ఆ అవకాశం లభించిందన్నారు.
నాట్ వెస్ట్ కప్ ఫైనల్ మ్యాచ్ 2002 జూలై 13న జరిగింది. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టు 326 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. లక్ష్య ఛేదనలో గంగూలీ సేన అద్బుతమైన ఆటతీరు కనబరిచింది. మరో మూడు పరుగులు మిగిలి ఉండగానే భారత జట్టు చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
ముఖ్యంగా విన్నింగ్ షాట్ కొట్టిన అనంతరం అప్పటి టీమ్ ఇండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన షర్ట్ విప్పి గాలిలో తిప్పుతూ విజయదరహాసం చిందించారు. ఆ దృశ్యాల్లో అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. ఇప్పటికి ఆ దృశ్యాలు టీమ్ ఇండియా అభిమానుల మదిలో మెదులుతూనే ఉంటాయి.