బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అహ్మదాబాద్ లో మహాత్మ గాంధీ నడిపిన సబర్మతి ఆశ్రమాన్ని ఆయన గురువారం సందర్శించారు. 1905 స్వదేశీ ఉద్యమానికి చిహ్నంగా ఉన్న చరఖాను తిప్పడానికి ఈ సందర్భంగా ఆయన ప్రయత్నించారు.
దీంతో ఆ చరఖాను ఎలా తిప్పాలో ఆశ్రమంలోని ప్రతినిధులు ఆయనకు చూపించారు. వారి సహాయంతో ఆయన చరఖాను తిప్పారు. ఆశ్రమ విజిటర్స్ బుక్ లో ఆయన ఓ సందేశాన్ని రాశారు.
‘ ఈ అసాధారణ వ్యక్తి(మహాత్మ గాంధీ) ఆశ్రమానికి రావడం, ప్రపంచాన్ని మెరుగుపరచడానికి సత్యం, అహింస వంటి సాధారణ సూత్రాలను ఆయన ఎలా సమీకరించారో అర్థం చేసుకోవడం చాలా గొప్ప అదృష్టం’ అని బ్రిటన్ ప్రధాని రాసుకొచ్చారు.
ఆ తర్వాత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో కలిసి హలోల్ లోని జేసీబీ ఫ్యాక్టరీకి వెళ్లారు. ఫ్యాక్టరీని పరిశీలించిన ఆయన ఓ జేసీబీ పైకి ఎక్కి మీడియాకు చేతులు ఊపుతూ కెమెరాలకు ఫోజు ఇచ్చాడు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.