కరోనా వైరస్ కు రాజు, పేద తేడా లేదు.. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులకు సోకిన ఈ వైరస్ ఇప్పడు తాజాగా బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కూడా అంటుకుంది. తనకు కరోనా వైరస్ టెస్ట్ పాజిటివ్ గా తేలిందని బోరిస్ జాన్సనే స్వయంగా సోషల్ మీడియా ట్విట్టర్ లో ప్రకటించారు. బోరిస్ జాన్సన్ కు కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారు. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వాన్ని నడపడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
”గత 24 గంటల్లో స్వల్ప లక్షణాలు కనిపించాయి…టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ గా తేలింది… ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను…అయినప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాను…అందరం కలిసి ఈ వైరస్ ను అంతం చేద్దాం..” అంటూ స్టే హోమ్స్..సేవ లైవ్స్ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ కు కూడా ఇటీవలనే కరోనా టెస్ట్ పాజిటివ్ గా తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ 5 లక్షల మందికి సోకగా…20 వేల మందికి పైగా బలయ్యారు.