పటాన్ చెరు చైతన్య నగర్ లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో అన్నదమ్ములు ఒకరిపై ఒకరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్రగాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. నర్సింగ్ రావు, చిరంజీవి, ప్రవీణ్‌కుమార్ అనే ముగ్గురు అన్నదమ్ములు పటాన్ చెరు చైతన్య నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరి మధ్య ఉన్న కుటుంబ కలహాల కారణంగా నర్సింగ్ రావు భార్య గత నెల 11న ఆత్మహత్య చేసుకుంది. దీనిపై నర్సింగ్ రావు కుమారుడు కుటుంబ సభ్యులపై కేసు పెట్టాడు. అది విచారణలో ఉండగా నిన్న రాత్రి నర్సింగ్ రావు తన సోదరులతో గొడవకు దిగాడు. ఒకరిపై ఒకరు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన ప్రవీణ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. నర్సింగ్ రావు, చిరంజీవిలు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Tolivelugu Latest Telugu Breaking News » Crime » అన్నదమ్ములు కత్తులతో పొడుచుకున్నారు