తమ కుమారుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ప్రతీ తల్లి తండ్రులకు ఉంటుంది. డబ్బు ఒకటి అయితే పేరు మరొకటి అన్నట్టు. అందుకే అంతర్జాతీయ క్రికెట్ లో చాలా మంది తమ పిల్లలను ఆడించడానికి నానా కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటిది ఇద్దరు పిల్లలు క్రికెట్ ఆడితే, ఇద్దరూ ఒకేసారి జాతీయ జట్టులో ఆడుతుంటే…? ఏ తల్లి తండ్రులకు అయినా సరే అది మరువలేని క్షణం అన్నట్టు. అసలు అంతర్జాతీయ క్రికెట్ లో ఆడిన బ్రదర్స్ ఎవరో ఒకసారి చూద్దాం.
పాండ్యా బ్రదర్స్: అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఇద్దరు ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యారు. ముంబై ఇండియన్స్ జట్టులో కూడా కలిసి ఆడుతున్నారు. గుజరాత్ నుంచి పేద కుటుంబం నుంచి ఈ ఇద్దరు పైకి వచ్చారు.
వా బ్రదర్స్: ఆస్ట్రేలియా క్రికెట్ లో ఈ ఇద్దరూ లెజెండ్స్ ఏ. మూడు వరల్డ్ కప్స్ ఇద్దరూ కలిసి ఆడారు అంటే అర్ధం చేసుకోవచ్చు. స్టీవ్ వా సారధ్యంలో ఆసిస్ 99 ప్రపంచ కప్ గెలిచింది.
అక్మల్ బ్రదర్స్: క్రమాన్ అక్మల్, ఉమర్ అక్మల్… కమ్రాన్ కీపర్ కాగా ఉమర్ బ్యాట్స్మెన్. ఆ తర్వాత ఉమర్ కూడా కీపర్ అయ్యాడు.
హస్సీ బ్రదర్స్: మైక్ హస్సీ మిస్టర్ క్రికెట్ గా పేరు తెచ్చుకున్నాడు. డేవిడ్ హస్సీ కూడా తర్వాత తన మార్క్ వేసాడు. ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్ లో చాలా రోజులు ఆడారు.
కల్లం బ్రదర్స్… బ్రెండన్, నాథన్… న్యూజిలాండ్ తరుపున ఈ ఇద్దరూ క్రికెట్ ఆడారు. 2011, 2015 ప్రపంచ కప్ లు కలిసి ఆడారు.
పఠాన్ బ్రదర్స్: యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్… అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఇద్దరూ బాగా ఫేమస్… 2007 టి 20 ప్రపంచ కప్ హీరోలు కూడా ఈ ఇద్దరూ.
కర్రన్ బ్రదర్స్: ఎంగాల్ద్న్ తరుపున ఈ ఇద్దరు ఆల్ రౌండర్స్ ఆడుతున్నారు. వీరి తండ్రి కెవిన్ జింబాబ్వే తరుపున ఆడారు.
లీ బ్రదర్స్: చాలా మందికి బ్రెట్ లీకి బ్రదర్ ఉన్నాడని తెలియదు. కానని బ్రెట్ లీ సోదరుడు షాన్ లీ 1995 నుంచి 2001 వరకు ఆసిస్ తరుపున 45 మ్యాచ్ లు ఆడారు.
మార్ష్ బ్రదర్స్: ప్రపంచంలో బాగా ఫేమస్ అయినా సరే క్రికెట్ లో మాత్రం బాగా ఇబ్బందులు పడుతున్నారు. షాన్ మార్ష్ బ్యాటింగ్ లో చాలా టాలెంట్ ఉన్నా సరే నిలకడ లేక ఇబ్బంది పడ్డాడు. మిచెల్ మార్ష్ బౌలింగ్ లో కూడా రాణిస్తున్నాడు.