ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లెక్కింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ సర్కార్ సవాల్ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని సీనియర్ సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే కోరారు.
ఈ కేసులో సీబీఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ ధ్వంసమవుతాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సీజేఐ స్పందించారు. పిటిషన్ ను రేపు ధర్మాసనం దృష్టికి తీసుకు రావాలని దుష్యంత్ దవేను సీజేఐ కోరారు.
పిటిషన్‌ను రేపు ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే దాన్ని వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామని సీజేఐ వెల్లడించారు. రేపు మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందని సీజేఐ తెలిపారు.