తెలంగాణలో రెండు జాతీయ పార్టీలకు ఇద్దరు పిచ్చోళ్లు అధ్యక్షులుగా ఉన్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బండి సంజయ్, రేవంత్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన సచివాలయం, ప్రగతి భవన్ల జోలికి వచ్చే దమ్ముందా? అంటూ ప్రశ్నించారు.ఇక నుంచైనా తెలంగాణ ప్రజల మనస్సుల్లో విషబీజాలు నాటే ప్రయత్నాలు మానుకోవాలని సలహా ఇచ్చారు. పిచ్చోళ్లను పట్టించుకోకుండా తెలంగాణాని అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నామని అన్నారు.
ప్రతిపక్షాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే కనీసం నాలుగైదు సీట్లైనా వస్తాయి.. లేకపోతే ఆ సీట్లు కూడా ఉండవని పేర్కొన్నారు.బీఆర్‌ఎస్ కి దేశాన్ని పాలించే సత్తా ఉంది కనుకే.. ఇప్పుడు దేశం మొత్తం బీఆర్ ఎస్ వైపు చూస్తుందన్నారు. తగిన సమయంలో ప్రజలే వారికి బుద్ది చెప్తురన్నారు.
కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా నోటికొచ్చింది మాట్లాడటం మానుకోవాలన్నారు. కేంద్రం సింగరేణి పై కక్ష గట్టింది. అందుకే గనులు కేటాయించకుండా మొండి చేయి చూపిస్తుందని మండిపడ్డారు.