టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడి ఎమ్మెల్యేలను తిడుతున్నారని ఆయన అన్నారు. ఇది పద్దతి కాదన్నారు. బ్లాక్ మెయిలింగ్ రేవంత్ రెడ్డి వృత్తి అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్ అని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ ఓ రాజకీయ వ్యభిచారి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం, అమరవీరుల స్మారక కేంద్రం, బీఆర్ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంలో అవినీతి అంటూ నిరాధార ఆరోపణలు చేశారన్నారు.
రేవంత్ రెడ్డిది పాదయాత్ర కాదన్నారు. అది కాంగ్రెస్‌కు పాడె గట్టే యాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. సమాచార హక్కు చట్టాన్ని బ్లాక్ మెయిలింగ్‌కు రేవంత్ రెడ్డి వాడుకుంటారని, ఇప్పుడు కూడా వీటిపై సమాచారం తీసుకోవచ్చని ఆయన అన్నారు.
తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే హక్కు రేవంత్‌కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. పెయింటర్‌గా జీవితం ప్రారంభించిన రేవంత్‌కు ఇన్ని ఆస్తులు ఎక్కడివని ఆయన ప్రశ్నలు గుప్పించారు. ఇకనైనా రేవంత్ పిచ్చి మాటలు మానుకోవాలని సూచించారు. లేకుంటే ప్రజా క్షేత్రంలో బట్టలు ఊడదీసి కొడతారని ఆయన హెచ్చరించారు.