అంబర్ పేట ఎమ్మెల్యే వెంకటేశ్ కు ప్రమాదం తప్పింది. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో ఈ అపశృతి చోటు చేసుకుంది.అంబర్ పేట నియోజక వర్గంలో ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలను బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో కాచిగూడ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. వాటి నుంచి వచ్చిన నిప్పు రవ్వలు ఒక్కసారిగా అక్కడే ఉన్న గ్యాస్ బెలూన్ల మీద పడ్డాయి.
దాంతో అవి ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో మంటలు పెద్దగా రావడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే, కార్యకర్తలు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోడ్డు మీద పడిపోయారు,.