తెలంగాణ మంత్రి కేటీఆర్ కు అంతర్జాతీయంగా వస్తోన్న ఆదరణను చూసి ఓర్చుకోలేక పోతున్నారని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే వివేక్. కొన్ని పార్టీల వాళ్లు బేస్ లెస్ ఎలిగేషన్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ను ఎందుకు బర్త్ రఫ్ చేయాలని ప్రశ్నించారు.
పేపర్ లీకేజీ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే వివేక్ తీవ్రంగా స్పందించారు. బండి సంజయ్ ఇప్పటికే అనేక ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి న్యాయస్థానంలో కేసులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మేము కూడా బండి సంజయ్ వ్యాఖ్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు ఎమ్మెల్యే.
దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పేపర్ లీకే చేసిన వారు బీజేపీ వాళ్లేనని, ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్న వారు ఉద్యోగాలు పొందేలా చేస్తున్నారని విమర్శించారు.పేపర్ లీకేజీ విషయంలో బండి కుట్రలు చేసారనడంలో సందేహం లేదన్నారు.
దేశంలో అనేక నోటిఫికేషన్లు తప్పుడు విధానాలతో ఉద్యోగాల భర్తీ చేస్తున్నారని, ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీక్ లకు పాల్పడ్డ మంత్రలు, సీఎంలను రాజీనామా చేయాలన్నారు. ప్రజా కోర్టులో వీరికి శిక్ష తప్పదని దుయ్యబట్టారు ఎమ్మెల్యే వివేక్.