లిక్కర్ కేసుకు సంబంధించి ఢిల్లీలో గురువారం ఈడీ ఎదుట తానెందుకు హాజరు కాలేదో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అధికారులకు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ కేసులో తన అభ్యర్థనకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ నెల 24 న ఉత్తర్వులు జారీ చేయవలసి ఉందని, ఆ రోజున తన పిటిషన్ ను విచారిస్తామని ఈ నెల 15 న సీజేఐ ఆధ్వర్యంలోని బెంచ్ పేర్కొందని ఆమె తెలిపారు. అంటే ఇది కోర్టు పరిశీలనలో ఉందన్నారు. ఈ నెల 7 న మీరు పంపిన సమన్లకు ప్రతిస్పందనగా ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నానని, ఒక మహిళగా ఛట్ఠం ప్రకారం తనకు భద్రత ఉందని, అందువల్ల ఈడీ కార్యాలయానికి తనను పిలవజాలరని ఆమె అన్నారు. నేను ఎప్పుడూ విచారణకు సహకరిస్తానని, ఆడియో లేదా వీడియో మోడ్ ద్వారా విచారణకు సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. చట్ట ప్రకారం అధికారులను తన నివాసానికి ఆహ్వానించానని..కానీ మీరు నా అభ్యర్థనను తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ కేసులో సంబంధిత వ్యక్తి భౌతికంగా మీ కార్యాలయంలో హాజరు కావలసిందేనని, ఈడీ కస్టడీలో ఉన్న వ్యక్తి దీన్ని పాటించాలని మీరు స్పష్టం చేశారని కవిత అన్నారు.
ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తానని ఈ నెల 8 నే నేను లేఖ రాశాను.. 11 న అధికారుల ముందు హాజరయ్యాను అని ఆమె గుర్తు చేశారు.
ఆ రోజున నాకు తెలిసిన అన్ని విషయాలను అధికారులకు వివరించాను.. సంబంధిత సమాచారాన్నంతా ఇచ్చాను.. వారు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలిచ్చాను.. ఫోన్ తీసుకురావాలని సమన్లలోఆదేశాలు లేకున్నా ఫోన్ తెచ్చేసరికి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. జరిగిన నేరానికి, నా ఫోన్ కి ఎలా సంబంధం ఉందో రికార్డుల్లో చూపలేదు.. పీఎంఎల్ చట్టం లోని 50 (5) సెక్షన్ కింద మీకు గల అధికారాలను మీరు ఉపయోగించుకున్నారు.. కానీ ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని నా లీగల్ నిపుణులు స్పష్టం చేశారు.. ప్రైవసీ హక్కు కింద ఫోన్ లోని అంశాలు కవర్ అవుతాయని వారు చెప్పారు అని కవిత వెల్లడించారు.
పైగా ఆ రోజు రాత్రి 8.30 గంటలవుతుండగా నేను వెళ్ళబోయేముందు కూడా మీ కార్యాలయంలో నన్ను కూర్చోబెట్టారు.. అంతసేపు అలా కూర్చోబెట్టడం భావ్యమా అని ఆమె ప్రశ్నించారు.
ఈ నెల 16 న మీరు జారీ చేసిన సమన్లలో.. భౌతికంగా లేదా అధికార ప్రతినిధి ద్వారా హాజరు కావాలన్న ఆదేశాలు లేవు.. అయినా ఈ కారణంవల్లే నా అధికార ప్రతినిధిగా బీఆర్ఎస్ నేత సోమా భరత్ కుమార్ ని గురువారం మీ వద్దకు పంపాను..
విచారణకు నేనేమీ వెనుకంజ వేయడం లేదు.. కానీ అన్ని అంశాల్లో రూల్ ఆఫ్ లా ను పాటించవలసి ఉంది..పైగా దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే అరెస్టయిన కొందరు వ్యక్తులతో కలిసి నేను ఫిజికల్ అపియరెన్స్ ఇవ్వాలన్న సూచన ఆశ్చర్యంగా ఉంది అని కవిత పేర్కొన్నారు.
అంటే విచారణ పవిత్రమైన పోకడలో సాగడం లేదని భావిస్తున్నా.. సక్రమంగా, నిస్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగడం లేదని అనుకుంటున్నా అని ఆమె అన్నారు.
నా ప్రాథమిక హక్కులకు తీవ్రంగా భంగం కలిగిందని, రాజ్యాంగబద్ధమైన ప్రత్యామ్నాయ మార్గాలను నేను వినియోగించుకోకుండా చూస్తున్నారని భావిస్తున్నా.. అందువల్లే రాజ్యాంగం లోని 32 అధికరణం కింద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశా అని తెలిపారు.
సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన ఈ పిటిషన్ లో పలు అంశాలు పేర్కొన్నట్టు కవిత వెల్లడించారు. పీఎంఎల్ ఏ లోని సెక్షన్ 50 కింద సమన్లు జారీ చేయడం క్రిమినల్ జురిస్ ప్రుడెన్స్ ప్రకారం నిబంధనలకు విరుద్ధమని, పీ ఆర్ సీ లోని 160 సెక్షన్ కింద ఇది అతిక్రమణ కిందకు వస్తుందని , పేర్కొన్న ఆమె.. ఈ సందర్భంగా 2020 నాటి పరమ్ వీర్ సింగ్ సైని వర్సెస్ బల్జిత్ సింగ్ అండ్ అదర్స్ కేసును ప్రస్తావించారు. ఈ నెల 11 న తన ఫోన్ ని స్వాధీనం చేసుకోవడం చెల్లదని ప్రకటించాలని కూడాఆమె కోరారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని ప్రతివాదులను ఆదేశించాలని కవిత అభ్యర్థించారు.
అదే రిట్ పిటిషన్‌లో నేను కింది తాత్కాలిక ఉపశమనాలు కోరాను.
a, పిటిషనర్ కు వ్యతిరేకంగా ప్రతి వాది 1 ఎలాంటి బలవంతమైన చర్యలు చేపట్టకుండా స్టే ఆర్డర్ జారీ చేయాలి
b,న్యూ ఢిల్లీలోని ప్రతి వాది ఆఫీసులో 16-03-2023న హాజరయ్యేలా పిటిషనర్ ను ఆదేశిస్తూ 11-3-2023న జారీ చేసిన సమన్లపై స్టే విధించాలి.
c,న్యూ ఢిల్లీలోని ప్రతివాది ఆఫీసులో 11-03-2023న హాజరయ్యేలా పిటిషనర్ ను ఆదేశిస్తూ 7-3-2023న జారీ చేసిన సమన్లపై స్టే విధించాలి.
d,ప్రతి వాది 11.03.2013న జారీ చేసిన ఇంపౌండింగ్ ఆర్డర్ పై స్టే ఆర్డర్ ఇవ్వాలి.
, ఈ రిట్ పిటిషన్ 24.03.2023న లిస్టింగ్ చేయాలని ఆదేశించిన సమయంలో సుప్రీంకోర్టులో గౌరవనీయులైన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలనలో ఉంది.
, పైన పేర్కొన్న సంఘటనలు, వాస్తవాలు, పరిస్థితుల నేపథ్యంలో ఈ విషయంపై సుప్రీంకోర్ట్‌లో విచారణ జరగాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఈ కేసులో కోర్టు తీర్పు తర్వాతనే తదుపరి ప్రొసీడింగ్స్ జరగాలని అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు.
,
మహిళను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు పిలిచే విషయానికి సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషన్ నం. 19275-76 of 2018 పెండింగ్ లో వుంది. అందులో చట్టం ప్రకారం మహిళను విచారణ నిమిత్తం కార్యాలయానికి రావాలని ఒత్తిడి చేయరాదని పేర్కొన్నారు. ఓ మహిళగా తన కేసు దానికి విభిన్నంగా లేదన్నారు.
,
నేను నా జీవితాన్ని ఈ సొసైటీకి అంకితం చేశాను. ఈ దేశ చట్టాలకు కట్టుబడి వుంటాను. ఈ దేశ నేతగా, ఓ పౌరురాలిగా చట్టాలను పాటించడం, అవి ఉల్లంఘనకు గురి కాకుండా చూడటం తన బాధ్యత అన్నారు. ఒక వేళ తన సొంత హక్కులు ఉల్లంఘించబడిఉంటే తాను చట్ట సభ సభ్యురాలిగా ఉన్నప్పటికీ, చట్టబద్ధమైన పాలన సాగేలా, ఏ ఏజెన్సీ ద్వారా ఎటువంటి ఉల్లంఘన జరగకుండా ఉండేలా తన పరిధిలో చట్ట ప్రకారం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం నా గురుతర బాధ్యత అన్నారు ఆమె.
,అయినప్పటికీ మీరు కోరినట్టుగా గత వారం హాజరయ్యాను. ప్రస్తుతం మీరు కోరిన విధంగా నా బ్యాంక్ స్టేట్‌మెంట్(లు), వ్యక్తిగత, వ్యాపార వివరాలను మీకు అంద చేసేందుకు మా ప్రతినిధి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారిని మీ వద్దకు పంపిస్తున్నాను. వీటితో పాటు మరేదైనా సమాచారం, డాక్యుమెంట్స్ కావాల్సి వుంటే మా ప్రతినిధికి తెలియజేయగలరు. లేదా నా మెయిల్ ఐడీని సంప్రదించగలరు.
.