బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి అంటూ.. వరంగల్ లో 200 కుర్చీలు పంచారు బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ సీఎం కుర్చీలో కూర్చోవాలంటూ.. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 200 కుర్చీల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు.
కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక సభ్యత్వంలో ప్రపంచ రికార్డు సృష్టించారన్నారు. పథకాలను ప్రవేశ పెట్టడంతో పాటు ఐటీ రంగంలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారన్నారు.
భారత దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్నారు.
అందుకే కేటీఆర్ ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలంటూ ఈ కుర్చీల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి. కాగా ప్రస్తుతం ఈ పంపిణీ కార్యక్రమంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.