మహారాష్ట్రలో ఈ రోజు బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించనున్నారు. నాందేడ్ జిల్లా లోహా పట్టణంలో నిర్వహించే ఈ బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ సభకు నాందేడ్ జిల్లా నలుమూలల నుంచి జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
లోహా పట్టణంలోని బైల్ బజార్‌లో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. లోహా పట్టణమంతా గులాబీ మయమైంది. ఎటు చూసినా గులాబీ జెండాలు, బ్యానర్లే కనిపిస్తున్నాయి. సభా ప్రాంగణంంలో సుమారు 50 వేల నుంచి 70 వేల మంది కూర్చునేందుకు వీలుగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.
ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన బేగం పేట విమానాశ్రయం నుంచి బయలు దేరి వెళ్లారు. ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకొంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాఫ్టర్‌లో సభా ప్రాంగణం వద్దుకు ఆయన చేరుకుంటారు.
లోహాలోని ఓ బీఆర్‌ఎస్ అభిమాని ఇస్తున్న తేనీటి విందుకు ఆయన హాజరు కానున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో ఆయన బయలుదేరుతారు. నేరుగా పట్టణంలోని బైల్ బజార్ సభాప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతారు.