లోక్ సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ నుంచి బీఆర్ఎస్ ను తొలగిస్తూ లోక్ సభ సచివాలయం టీ ఆరెస్ కు షాకిచ్చింది. ఆరుగురికంటే ఎక్కువ మంది సభ్యులున్న పార్టీకే బీఏసీలో సభ్యత్వం ఉంటుందని స్పష్టం చేసింది.
టీ ఆరెస్ తరఫున బీఏసీ సభ్యుడిగా నామా నాగేశ్వరరావు ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో లోక్ సభ బీఏసీ నుంచి బీ ఆర్ ఎస్ ను మెంబర్ గా తొలగించి ఇన్వైటీగా.. ఆహ్వానిత పార్టీగా మారుస్తున్నట్టు లోక్ సభ బులెటిన్ వెల్లడించింది.
ఇక ఇతర రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల మహారాష్ట్ర బీ ఆర్ ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షునిగా మాణిక్ కదమ్ ను నియమించిన ఆయన.. తాజాగా ఆ రాష్ట్ర డివిజన్ కో-ఆర్డినేటర్లను నియమించారు.
నాసిక్ డివిజన్ కు దశరథ్ సావంత్, పూణే డివిజన్ కు బాలాసాహెబ్ జైరాం దేశ్ ముఖ్, ముంబైకి విజయ్ తనాజీ మోహితే, ఔరంగాబాద్ కు సోమ్ నాథ్ థోరట్, అమరావతికి నిఖిల్ దేశ్ ముఖ్ ను సమన్వయ కర్తలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూపీ బీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను హిమాంశు తివారీకి అప్పగించారు.