సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మహమ్మద్ మొనసిద్దిఖీ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. మృతి చెందిన వ్యక్తిపై ఒక్క క్షణంలోనే అతికిరాతకంగా దాడి జరిపడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
వివరాల్లోకి వెళితే..మొనసిద్దిఖీ ఇంటికి మరో వ్యక్తి వచ్చాడు. మాటలు కలిపి తీవ్రంగా మొనసిద్దిఖీ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య మాటకు మాట పెరిగింది. ఇంతలో ఒక్కసారిగా అతనిపై దాడి చేశాడు. దీంతో అందరూ చూస్తుండగానే అతను అక్కడికక్కడే చనిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. అయితే స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బార్కాస్ కు చెందిన మహమ్మద్ మొనసిద్దిఖీని, దిల్కుష్ నగర్ కు చెందిన ఫైజుద్దీన్ అనే వ్యక్తి హతమార్చినట్లు గుర్తించారు.
12 గజాల స్థలానికి సంబంధించిన వివాదంలో.. మొనసిద్దిఖీకి 50 లక్షల రూపాయలు ఫైజుద్దీన్ ఇచ్చినట్టు సమాచారం. అయితే అటు డబ్బులు ఇవ్వకపోగా ల్యాండ్ వివాదంగా మారడంతో ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. దిల్ కుష్ నగర్ లోని ఇంటికి రావాలని మొనసిద్దిఖీకి పిలిపించిన ఫైజుద్దీన్.. కళ్లల్లో కారం కొట్టి అతని పై దాడి చేసి హత్య చేశాడు. దీంతో సిద్దీఖీ అక్కడికక్కడే మృతి చెందాడు. బోయిన్ పల్లి పోలీసులు ఫైజుద్దీన్ ను అదుపులో తీసుకున్నారు.
సిద్దిఖీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుడు మొనసిద్దిఖీ పాతబస్తీలో కేఎంఆర్ ఇండియా హోమ్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ.. చాలా మంది దగ్గరి నుంచి పెద్ద మొత్తం లో రసీదులు లేకుండా డబ్బులు కట్టించుకున్నాడు. దీంతో బాధితులు ఎవరికి డబ్బులు అడిగాలని.. కష్టపడిన రూపాయి.. రూపాయి అతనికి కట్టామని లబోదిబోమంటున్నారు. కేఎంఆర్ ఇండియా హోమ్స్ లో తమకు ఫ్లాట్స్ వస్తాయా.. లేక కనీసం కట్టిన డబ్బులైనా వెనక్కి వస్తాయా అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.