ఓ శునకం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చిక్కులు తెచ్చి పెట్టింది. మన దేశపు స్నిపర్ డాగ్ బంగ్లాదేశ్ బోర్డర్లో ప్రశవించింది. ప్రస్తుత ఈ శునకం తెచ్చుకున్న గర్భం ఫలితంగా వచ్చే ప్రశవం బీఎస్ఎఫ్ వాళ్ళకు తలనొప్పులు తెచ్చిపెట్టింది.
బీఎస్‌ఎఫ్ స్నిఫర్ డాగ్ లాల్సీ (Lalcy) బంగ్లాదేశ్ బార్డర్‌లో ప్రసవించింది. డిసెంబర్ 5న ఉదయం బగ్‌మారా బీఓపీ వద్ద మూడు కుక్క పిల్లలకు లాల్సీ జన్మనిచ్చింది. దీనిపై అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించారు.
రూల్స్ ప్రకారం..హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న శునకాలు గర్భం దాల్చకూడదు. ఫోర్స్‌లోని వెటర్నరీ వింగ్ పర్యవేక్షణలో ఉన్నప్పుడు మాత్రమే అవి గర్భం దాల్చాల్సి ఉంటుంది. అలా కాకుండా సెక్యూరిటీ జోన్‌లో ఉన్న ఏ శునకమైనా గర్భం దాల్చితే అది నిబంధనలకు విరుద్ధంగా పరిగణిస్తారు.
బంగ్లాదేశ్ సరిహద్దులోని మేఘాలయాలో గల షిల్లాంగ్‌లోని బార్డర్ ఔట్ పోస్టు(బీవోపీ) హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న లాల్సీ ప్రసవించడంపై బీఎస్‌ఎఫ్, 170 బెటాలియన్ ఆఫీస్ కమాండెంట్ ధనక్‌గిరి స్పందించారు.
ఘటనపై విచారణ చేపట్టాలని డిప్యూటీ కమాండెంట్‌ను ఆదేశించారు. 43వ బెటాలియన్‌కు చెందిన డాగ్ లాల్సీ ఏ పరిస్థితుల్లో గర్భం దాల్చి మూడు కుక్క పిల్లల్ని ప్రసవించిందో దర్యాప్తు చేపట్టాలన్నారు.
కాగా, ఈ ఘటనపై బీఎస్ఎఫ్ వెటర్నరీ వింగ్ సీనియర్ ఆఫీసర్ ఒకరు స్పందిస్తూ.. ‘మేము శిక్షణ ఇచ్చిన శునకం గర్భం దాల్చడానికి సంబంధించి ఓ ప్రొసీజర్ ఉంటుంది. శునకాన్ని హ్యాండిల్ చేస్తున్నవారి నిర్లక్ష్యం కారణంగా లాల్సీ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది’ అని వివరించారు