పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ డ్రోన్ జారవిడిచిన ఆయుధాలు, మాదకద్రవ్యాలను బీఎస్‌ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఒక అధికారి వివరాలను వెల్లడించారు.
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లోని సరిహద్దు పోస్ట్ ఎండబ్ల్యూ ఉత్తర్ ప్రాంతంలో గురువారం- శుక్రవారం మధ్య రాత్రి భారత భూభాగంలోకి వచ్చిన డ్రోన్‌పై సైనికులు కాల్పులు జరిపారు.
అనంతరం బీఎస్‌ఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించగా.. డ్రోన్ ద్వారా జారవిడిచిన సుమారు 3 కిలోల హెరాయిన్, ఒక చైనీస్ పిస్టల్, ఐదు గుళికలు, మ్యాగజైన్‌తో కూడిన ప్యాకెట్ లభించిందని బీఎస్‌ఎఫ్ ప్రతినిధి తెలిపారు.
ఇప్పటి వరకు డ్రోన్‌ను స్వాధీనం చేసుకోలేదని బీఎస్‌ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇక, ఇందుకు సంబంధించిన వివరాలను బీఎస్‌ఎఫ్.. ట్విట్టర్ వేదికగా కూడా వెల్లడించింది.