పంజాబ్‌లో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్ కలకలం రేపింది. గురుదాస్ పూర్‌లో అంతర్జాతీయ సరిహద్దు దగ్గర ఆదివారం ఉదయం 9.15 గంటల సమయంలో ఓ డ్రోన్ ను సరిహద్దు భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో డ్రోన్ పై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి కూల్చి వేసింది.
డ్రోన్ నుంచి భారీ సైజులో ఉన్న ఓ పార్సిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానిలో భారీగా మాదక ద్రవ్యాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. పార్సిల్ బరువురు 4 కేజీలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అనంతరం సరిహద్దుల వద్ద గాలింపు చర్యలు చేపట్టారు.
సరిహద్దుల్లోని ఖసావాలి గ్రామం వద్ద నిన్న పాకిస్థానీ స్మగ్లర్ల కదలికలను భద్రతా సిబ్బంది గుర్తించింది. దీంతో స్మగర్లు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపుచేపట్టాయి.
సరిహద్దు వద్ద ఫెన్సింగ్‌కు 30 మీటర్ల దూరంలో 15 అడుగుల పొడవున్న ఓ పైపును భద్రతా దళాలు గుర్తించాయి. దానిగుండా మాదక ద్రవ్యాలు, ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా 20 ప్యాకెట్లలో హెరాయిన్, రెండు తుపాకులు, ఆరు మ్యాగజైన్లు, 242 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.