బీఎస్ఎన్ ఎల్ ఏపీ సర్కిల్, సిటీ ఆన్ లైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా డిజిటల్ టీవీ ఛానల్స్ ప్రసారాలకు నడుం కట్టాయి. డిజిటల్ టీవీ ఛానల్స్ పై రోజురోజుకూ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను దృష్టిలోనుంచుకుని ఈ ప్రసార సేవలకు గాను బీఎస్ ఎన్ఎల్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ విభాగంలో సరికొత్త వినియోగదారులపై అదనపు చార్జీలు ఉండబోవు.
ఉల్కా టీవీ అనే బ్రాండ్ పేరుతో గల సిటీ ఆన్ లైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్.. ఈ సేవలను బీఎస్ఎన్ ఎల్ యొక్క ఐపీ నెట్ వర్క్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అందించనుంది. . అంటే ఉల్కా టీవీ బ్రాండ్ కి సంబంధించి తన ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకు ఐపీటీవీ సర్వీసులను అందించేందుకు బీఎస్ ఎన్ ఎల్ ఏపీ సర్కిల్ ..ఈ సంస్థ తో చేతులు కలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో బీఎస్ ఎన్ ఎల్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు పొందుతున్న ప్రస్తుత, లేదా కొత్త వినియోగదారులు బీఎస్ ఎన్ ఎల్ ఆన్ లైన్ మీడియా.. అంటే ఉల్కా టీవీ ఆఫర్ ని పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో బీఎస్ ఎన్ ఎల్ ఐపీ నెట్ వర్క్ పై డిజిటల్ టీవీ ఛానళ్ల డెలివరీ కోసం సీడీఎన్ సర్వర్ల ద్వారా ఉల్కా టీవీ నిరంతరాయంగా టీవీ బ్రాడ్ కాస్ట్ సర్వీసులను అందజేయగలుగుతుంది.
బీ ఎస్ ఎన్ ఎల్ రెండో అతిపెద్ద వైర్ లైన్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అన్న సంగతి తెలిసిందే.. దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతంలోను దీనికి విస్తృత పాన్ ఇండియా ఆప్టిక్ ఫైబర్ నెట్ వర్క్ ఉంది.
భారత ప్రభుత్వం చేబట్టిన ‘డిజిటల్ ఇండియా’ ప్రోగ్రాం విజన్ కి అనుగుణంగా ఇండియాలో సామాజిక-ఆర్థిక వ్యవస్థల వృద్ధికి తన బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను విస్తృతం చేసేందుకు అనువైన ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్, ఐపీ-ఎంపీ ఎల్ ఎస్ కి సంబంధించి పాన్ ఇండియా స్థాయిలో ఈ సంస్థకు సామర్థ్యం కూడా ఉంది.
ఇండియాను డిజిటల్ పరంగా సాధికార సొసైటీగాను, నాలెడ్జ్ ఎకానమీ గల దేశంగాను మార్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
దేశ వ్యాప్తంగా 27 లక్షల మంది కస్టమర్ బేస్ తో కూడిన బీఎస్ ఎన్ ఎల్.. కి ఇతర ఫిక్స్డ్ లేదా మొబైల్ టెలికం సర్వీసులున్నాయి. వీటికి తోడు అదనంగా ఐపీటీవీ వ్యవస్థ కూడా ఉన్నందున ఒకేఒక్క సింగిల్ కనెక్షన్ లో వీరు తమ ఇంటర్నెట్ లో వెయ్యి టీవీ చానళ్లను చూడగలుగుతారు.
ఐపీటీవీ ఎస్ టీ బీ స్మార్ట్ టీవీ, మొబైల్ ప్రాడక్ట్స్ లో సర్వీసు ఉన్న ఉల్కా టీవీ ప్రీమియర్ ఐపీటీవీ సర్వీసు గల సంస్థ. ఇండస్ట్రీలో ఉత్తమ నాణ్యత గల వీడియోలను డెలివరీ చేసేందుకు హై ఎఫిషియన్సీ వీడియో కోడింగ్ తో బాటు 4 కె టెక్నాలజీని ఉల్కా టీవీ వినియోగించుకుంటుంది.
బీఎస్ ఎన్ ఎల్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లను వినియోగించుకుని ఉల్కా టీవీ ఎస్టీబీ పాపులర్ ఓటీటీ అప్లికేషన్లను, వెయ్యి లైవ్ శాటిలైట్ టీవీ చానళ్లను లోకల్ స్టేషన్లను ప్రొవైడ్ చేయగలుగుతుంది. తమ టీవీ సె ట్లకు గాను వినియోగదారులు టీవీ సిగ్నల్స్ పొందాలంటే డిష్ యాంటెన్నాలు గానీ, కిటికీల్లో లేదా గోడల్లో రంధ్రాలు గానీ చేయవలసిన అవసరం లేదు. భారీ మబ్బులు ఏర్పడినప్పుడో లేదా వర్షాలు పడినప్పుడో కూడా సిగ్నల్ పోవడమంటూ ఉండదు.కూడా..
ఉల్కా టీవీ సర్వీసులను వినియోగించుకునేందుకు బీఎస్ ఎన్ఎల్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కన్స్యూమర్లు పోర్టబుల్ సెట్ టాప్ బాక్సులను లేదా వైఫై యాక్సెస్ ను.. దేన్నైనా వాడవచ్చు. దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు.
ఓటీటీలతో పోల్చుకుంటే ఉల్కా టీవీ వల్ల అతి తక్కువ డేటా వినియోగం జరుగుతుంది. కానీ ఓటీటీ అప్లికేషన్లలో ఈ సౌలభ్యం ఉండదు
కేవలం ఓ బ్లూ టూత్ కీ బోర్డు ఈ వ్యవస్థకు ఉన్నందున ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ గానీ లేకుండానే విద్యా సంబంధ పనులకు అనువుగా ఉల్కా టీవీ ఎస్టీబీ కారణంగా ..టీవీ సీట్లపై రెండు వైపులా కమ్యూనికేట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. అలాగే యుఎస్బీ కెమెరాను ఎటాచ్ చేస్తే చాలు.. ఐపీటీవీ వినియోగదారులు రెండు వైపుల నుంచి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని సైతం ఉల్కా టీవీ ఎస్టీబీ కల్పిస్తుంది. హెల్త్ కేర్, విద్య, పన్నుల సేకరణ, ఇతర ప్రజా యూటిలిటీ సేవలను ఉల్కా టీవీ ఎస్టీబీ ని వినియోగించుకుని పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో ఈ బీఎస్ ఎన్ఎల్-ఉల్కా ఐపీటీవీ సర్వీసులను బీఎస్ ఎన్ ఎల్ బోర్డు (సీఎఫ్ఏ) డైరెక్టర్ శ్రీ వివేక్ బంజాల్ ఈ నెల 20 న విజయవాడలో ప్రారంభించనున్నారు.
ఈ విశిష్ట సేవల ప్రారంభంతో దేశంలో ఉన్నతమైన నాణ్యతతో కూడిన 4 కే టీవీ ప్రసారాలలో ఓ నూతన శకానికి నాంది పలికినట్టవుతుంది.