బీఎస్ఎన్ ఎల్ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి ఉద్యోగుల మంచి స్పందన లబిస్తోంది. నవంబర్ నాలుగో తేదీ తుది గడువు వరకు 70 వేల మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. బీఎస్‌ఎన్ ఎల్ ఉద్యోగులు మొత్తం లక్షా 50 వేల మంది కాగా…అందులో లక్ష మంది వరకు వీఆర్‌ఎస్ కు అర్హులు. వీరిలో ఇప్పటి వరకు 70 వేల మంది దరఖాస్తు చేసుకోగా మరో 30 వేల మంది మిగిలారు. దీంతో ఆసక్తి ఉన్న మిగతా వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 3వ తేదీ వరకు గడువును పొడిగించినట్టు బీఎస్‌ఎన్ ఎల్ ఛైర్మన్, ఎండీ పీకే పుర్వార్ తెలిపారు. 70 వేల నుంచి 80 వేల మంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకుంటే సంవత్సరానికి రూ.7000 కోట్లు ఆదా అవుతుందని అన్నారు. 50 సంవత్సరాలు పైబడిన బీఎస్ఎన్ ఎల్ ఉద్యోగులందరూ వీఆర్ ఎస్ కు అర్హులు. వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులకు ఇంత వరకు పనిచేసిన కాలానికి సంవత్సరానికి 35 రోజుల చొప్పున, మిగిలి ఉన్న కాలానికి సంవత్సరానికి 25 రోజుల చొప్పున వేతనం చెల్లిస్తామని బీఎస్ ఎన్ ఎల్ ప్రకటించింది.