పౌరసత్వ చట్టాన్ని సమర్ధించిన యూపీ బీఎస్పీఎమ్మెల్యే రమాభాయ్ పరిహార్ పై వేటు పడింది. రమాభాయ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బీఎస్పీ అధినేత మాయావతి ఆదివారం ట్విట్టర్ లో ప్రకటించారు. ఇక నుంచి రమాభాయ్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరాదని పేర్కొన్నారు. బీఎస్పీ క్రమశిక్షణ గల పార్టీ అని..పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి పౌరసత్వ చట్టాన్ని సమర్ధిస్తున్నందుకు ఆమెపై వేటు వేసినట్టు తెలిపారు.
”పౌరసత్వ చట్టం ప్రజలను విభజస్తుందని…ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ అందరి కంటే ముందుగా వ్యతిరేకించిన పార్టీ బీఎస్పీ. తమ పార్టీ పార్లమెంట్ లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసింది…దీనిపై పునరాలోచించాలని రాష్ట్రపతిని కూడా కోరింది” అయినప్పటికీ దీనికి భిన్నంగా రమాభాయ్ పరిహార్ పౌరసత్వ చట్టాన్ని సమర్ధిస్తున్నారు అని మాయావతి ట్విట్టర్ లో రాశారు. పార్టీ లైన్ ను తప్పుతున్నట్టు ఎమ్మెల్యేను గతంలో చాలా సార్లు హెచ్చిరించినట్టు తెలిపారు.
ప్రజలను మత ప్రాతిపదికగా విభజించే వివాదస్పద పౌరసత్వ చట్టంపై ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీఎస్పీ గత వారం ప్రభుత్వాన్ని కోరింది