టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. సోమవారం ఆయన ట్వీట్ చేస్తూ.. కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. సీఎం కుటుంబం స్కాముల్లో పీకల దాకా మునిగిందని, ఇక నిరుద్యోగుల ఇబ్బందులు వారికెలా కనిపిస్తాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో రాకరాక ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయని, నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూడకముందే, కళ్లల్లో కారం చల్లినంత వార్త వినాల్సి వచ్చిందన్నారు. ఉద్యోగం కోసం కారం మెతుకులు తిని, అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్నవారు ఏమైపోవాలి కేసీఆర్? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
రోజూ స్కామర్లను రక్షించడంలో బీజీగా ఉంటే, పాలన స్తంభిస్తుందని, ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ లీకేజీ పాలనకు తెరదించాల్సిందేనని, ‘కేసీఆర్ కో హాఠావో – తెలంగాణ కో బచావో’ అంటూ వ్యాఖ్యానించారు ప్రవీణ్ కుమార్.
కాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ పేపర్ లీక్ కారణంగా ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షతో పాటు ఈ నెల 15, 16వ తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షను టీఎస్పీఎస్సీ వేసింది.
తెలంగాణలో రాకరాక ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయని నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూడకముందే,కళ్ళల్లో కారం చల్లినంత వార్త. ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తే,ఉద్యోగం కోసం కారం మెతుకులు తిని చదువుతున్న వారు,అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటున్నవారుఏమైపోవాలి #KCR?. #BRS లీకేజీ పాలనకు తెరదించాల్సిందే. pic.twitter.com/SI8XHmp2Uo
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 13, 2023