తెలంగాణ ప్రభుత్వంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఐ ఫోన్ ను ప్రభుత్వం హ్యాక్ చేస్తోందంటూ ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా యాపిల్ సంస్థ తెలిపినట్లు చెప్పారు. యాపిల్ సంస్థ నుంచి తనకు మెయిల్ వచ్చిందని తెలిపారు. ఆ మెయిల్ ను కూడా ట్విటర్ లో షేర్ చేశారు.
ప్రభుత్వాలు తన ఫోన్ ను హ్యాక్ చేస్తుందని ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారు. జాగ్రత్తగా ఉండమని యాపిల్ తనను హెచ్చరించినట్టు చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ పై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేసింది. తమ ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నాయకులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
“ప్రభుత్వాలు నా ఐ ఫోన్ ను హ్యాక్ చేస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండమని యాపిల్ నన్ను హెచ్చరించింది. మీ లాగా నేను నా ఫోన్ ను ధ్వంసం చేయను. కానీ మీ దోపిడి, చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేసి.. మా మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా..” అంటూ ట్విటర్ లో ప్రవీణ్ కుమార్ రాసుకొచ్చారు.
ప్రభుత్వాలు నా iPhoneను హ్యాక్ (Hack) చేస్తున్నాయి,జాగ్రత్తగా ఉండమని @Apple నన్ను హెచ్చరించింది. మీ లాగా నేను నా ఫోన్ ను ధ్వంసం చేయను😊కానీ మీ దోపిడి-చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేసి, మా మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా👊 @BRSparty @BJP4India pic.twitter.com/F3AWo3cjR1
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 1, 2023