టీఆర్ఎస్‌పై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పని ఖతమైందన్నారు. టీఆర్ఎస్ పరిస్థితి తన్నితే కూలిపోయే గోడలా ఉందని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోయినా టీఆర్‌ఎస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందన్నారు.
గెలిచే దమ్ము లేక టీఆర్ఎస్ నేతలు ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, వాహనాలను తనిఖీ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఎవరి బెదిరింపులకు బహుజన్ సమాజ్ పార్టీ భయపడదన్నారు. దొరల పాలనను కూల్చేదాక తాము నిద్రపోమన్నారు. నూటికి తొంబై తొమ్మిది శాతం బహుజనులు ఉన్నారని, కేవలం ఒక్క శాతం ఉన్న దొరలు పాలకులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఓట్లు మావి సీట్లు మాత్రం మీకా..? అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇకపై అది చెల్లదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మునుగోడులో బీఎస్పీ అభ్యర్థిగా ఆందోజు శంకరాచారి ఈ రోజు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.