‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో బ్రిటిష్ వాళ్ళకు మన నాటు పాట రుచి చూపించిన అచ్చతెలుగు పాట “నాటునాటు’’ .మనదైన జానపదాన్ని ప్రపంచం గుండెల్లో నాటిన పాట. ప్యాన్ వరల్డ్ లో ఈ పాటకు ఫ్యాన్స్ ఉన్నారు.ఇప్పుడు ఆ జాబితాలో దక్షిణ కొరియా కూడా చేరింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూత్ ఫుల్ మ్యూజిక్ బ్యాండ్ ‘బీటీఎస్’ సింగర్ జంగ్‌కుక్ కూడా ఈ పాటకు ఫిదా అయ్యారు.
‘బీటీఎస్’ దక్షిణ కొరియాకు చెందిన మ్యూజిక్ బ్యాండ్. జంగ్‌కుక్, ఆర్‌ఎం, వి, జిమిన్, జిన్, జె.హోప్, సుగా.. ఇలా ఏడుగురితో ఈ బ్యాండ్ నడుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్లలో ఈ బ్యాండ్‌కు అభిమానులున్నారు.
ఇటీవల అభిమానులతో నిర్వహించిన లైవ్ షోలో జంగ్‌కుక్.. ‘నాటు నాటు’ పాటను ఎంతో ఎంజాయ్ చేశారు. సీటులో కూర్చొనే పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దీనిపై ‘ఆర్‌ఆర్‌ఆర్’ బృందం తాజాగా స్పందించింది. ‘‘జంగ్‌కుక్… ఈ పాటను మీరు ఇంతలా ప్రేమిస్తున్నారని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీకు, బీటీఎస్ బృందం, దక్షిణ కొరియా మొత్తానికి టన్నుల కొద్దీ ప్రేమాభిమానాన్ని పంపిస్తున్నాం’’ అని ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.
మరోవైపు, ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే! అయితే ఇంతగా ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రానికి తప్పకుండా ఆస్కార్ రావాలని, వస్తుందని సినీ ప్రియులు ఆకాంక్షిస్తున్నారు.
JUNGKOOK….❤️🔥❤️🔥❤️🔥
It's amazing to know that you loved #NaatuNaatu so much.🕺🕺
We are sending a ton of love to you, the #BTS team, and the whole of South Korea.🤗🤗 #RRRMovie pic.twitter.com/ktAEfc56xB
— RRR Movie (@RRRMovie) March 3, 2023