‘రాజధాని గురించి ట్విట్టర్‌లో కాదు, దమ్ముంటే అక్కడకి వచ్చి రైతుల ముందు మీ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పి వెళ్లండి 420 తాతయ్యా..’ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నవైసీపీ నేత విజయసాయిరెడ్డికి సవాల్ చేశారు.
ట్విట్టర్‌లో బుద్దా వెంకన్న విజయసాయిరెడ్డి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సిగ్గు లేని సాయిరెడ్డి గారు.. అమరావతిలో లక్షల కోట్ల అవినీతి జరిగిందా? మరి మూడు నెలల నుంచి ఏం గడ్డి పికుతున్నారు.? నోరు ఉంది కదా అని అడ్డమైన ఆరోపణలు మానండి. అధికారంలోకి ఉన్నది మీరేనన్న విషయం మర్చిపోకండి. నీ దొంగ పేపర్‌లో రాసే వార్తలు అక్షర సత్యాలా? వరల్డ్ బ్యాంక్ వెళ్లిపోవడానికి మీ కుట్రే కారణం అని పత్రికలు బయటపెడితే అవి పచ్చ పత్రికలు అని మీడియాని అవమానపరుస్తారా?..’ అంటూ వెంకన్న వైసీపీ నేతపై చెలరేగిపోయారు.