చంద్రబాబుగారికి రూపాయి ఖర్చు లేకుండా రాయిటర్స్ లాంటి ప్రతిష్టాత్మక న్యూస్ ఏజెన్సీలను కూడా యెల్లో మీడియా అని, ఆయన ఎలా చెబితే అలా ఆడతాయని చెప్పి ఎంతో మేలు చేస్తున్న విజయసాయి రెడ్డి గారికి ధన్యవాదాలంటూ విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.
జగన్ గారి తుగ్లక్ నిర్ణయాలు, మీ సైకో నిర్ణయాలు చూసి రాష్ట్ర మీడియా దగ్గర నుండి జాతీయ మీడియా వరకూ జగన్ గారిని తుగ్లక్ గా అభివర్ణిస్తూ రఫ్ఫాడిస్తున్నాయి. అవన్నీ యెల్లో మీడియా అని మాకు అప్పజెప్పాలి అనుకుంటే మరీ సంతోషం విజయసాయి రెడ్డిగారంటూ ఎద్దేవా చేశారు. 151 సీట్లు గెలిచిన 8 నెలల్లోనే గేట్లు తెరవమంటారా అని మీరు ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి వచ్చింది. అప్పుడే ప్రజలకు అర్ధం అయ్యింది ఎవరికి దమ్ములేదో, ఎవరు పిరికిపందలో అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.