బొత్స గారు చెప్పారంటే అది వైకాపాలో వేద్దావాక్కెనన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. అమరావతి నుండి రాజధానిని తరలిస్తున్నట్టు మొదట చెప్పింది బొత్స గారేనని, ఇప్పుడు ఎన్డీయేలో వైసీపీ కలవబోతోందని బొత్స చెప్పారని తెలిపారు. అత్యధిక ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధిస్తామన్న జగన్ ఇప్పుడు కేంద్రం ముందు ఎందుకు మోకరిల్లారో బొత్స గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా మంత్రి బొత్సపై బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు.
కేసుల మాఫీ కోసమా, లేక బెయిల్ రద్దు అవ్వకుండా ఉండేందుకా.. దేని కోసం ఎన్డీయే లో చేరుతున్నారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు బొత్స సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తల వంచి, కాళ్లు పట్టుకొని ఎన్డీయేలో చేరి సాధించబోయేది ఏంటో బొత్స గారు వివరించాలని కోరారు.
Advertisements