బుద్ధా వెంకన్న, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్రానికి కొత్త కంపెనీలను తీసుకొచ్చే సత్తా వైసీపీ ప్రభుత్వానికి లేదు. అందుకే మాంసం మార్టుల ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. ప్రభుత్వం మాంసం, చేపలు అమ్మి బడుగు, బలహీనవర్గాల పొట్ట కొట్టాలని చూస్తోంది. విజయసాయి ఐడియాతోనే మటన్ మార్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నారు. జగన్, విజయసాయి ఆలోచనలన్నీ వారి ఖజానా నింపుకోడానికే తప్ప ప్రజలకు మేలు చేయవు.
డిగ్రీ, పీజీలు చదివిన వారిని మాంసం షాపుల్లో పని చేయిస్తారా..? సరైన ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ సీఎం అవసరమా..? ఇప్పటికే ప్రభుత్వ దుకాణాల్లోని కల్తీ మద్యం తాగి చనిపోతున్నారు. భవిష్యత్తులో కల్తీ మాంసం, చేపలు విక్రయించేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించారా..? మాంసం అమ్మకాలు చేపట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే బడుగు, బలహీనవర్గాలతో కలిసి టీడీపీ పోరాటం చేస్తుంది.