యనమలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. యనమల గారు శాసనమండలిలో రెండు రోజుల పాటు మీ తుగ్లక్ గారికి, 23 మంది మంత్రులకు చుక్కలు చూపించారు. మిమ్మల్ని అయితే మరీ దారుణం 2రోజుల పాటు మండలి గ్యాలరీ, లాబీల్లో కాలు కాలిన పిల్లిలా తిప్పారు. ఆ రోజు విజయసాయిరెడ్డి ముఖంలో కనిపించిన టెన్షన్ మీరు జైలు కి వెళ్లినప్పుడు కూడా లేదు సుమీ అని విమర్శించారు.
కేంద్రం మెడలు వంచుతాం అంటూ దొంగ రాజీనామాలు చేశారు. కష్టాల్లో ఉన్న రైతుల కోసం పదవి త్యాగానికి సిద్ధపడ్డాం. కాలం చెల్లింది యనమల గారికి కాదు సాయి రెడ్డి గారు జగన్ గారి తుగ్లక్ నిర్ణయాలకు కాలం చెల్లింది. పొరపాటున ప్రజల్లో తిరిగే ధైర్యం చెయ్యకండి’ అని అన్నారు. సాక్షి చూడటం తగ్గిస్తే పగటి కలలు కనే జబ్బు తగ్గుతుంది. 2 లక్షలు దొరికాయో, 43 వేల కోట్లు దొరికాయో కోర్టులో తేలిపోతుంది. జగన్ గారితో పాటు మీ శాశ్వత నివాసం చంచల్ గూడా జైలుకి వెళ్లడానికి సిద్ధంగా ఉండండంటూ ట్వీట్ చేశారు.