ఎవరికో పుట్టిన బిడ్డకి తండ్రి జగన్ గారే అని సమాజాన్ని నమ్మించాలనుకుంటున్న విజయసాయిరెడ్డి గారికి సానుభూతి తెలుపుతున్నామన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. మీరు చేసిన ఆరు నెలల పాలన అద్భుతంగా ఉందని నీతి ఆయోగ్ ర్యాంక్ ఇచ్చిందా..మీ సంక్షేమ కార్యక్రమాలు చూసి నీతి ఆయోగ్ ఆశర్యపోయిందా అంటూ చురకలు అంటించారు. నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పడానికి సిగ్గుగా లేదా మీరు మంచి పరిపాలన అందించి అవార్డులు తీసుకుంటే నేను అభినందించేవాడిని కానీ 2015 నుండి 2019 వరకు చంద్రబాబుగారి హయాంలో వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధిని గుర్తించి ఇచ్చిన ర్యాంకింగ్ ని జగన్ గారు కష్టపడి సాధించినట్టు మీరు ఇస్తున్న బిల్డప్ చూస్తేంటే మీ పరిస్థితి ఏంటో అర్ధం అవుతుందంటూ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.