సీబీఐ కోర్టుకు ప్రతీ శుక్రవారం వెళ్ళే ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత హజరు పిటిషన్ ను కొట్టివేయడంతో టీడీపీ నాయకులు విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు.
టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న విజయసాయి రెడ్డిని టార్గెట్ చేశారు. దీని లెక్కెంతో చెప్పండి లెక్కల మాస్టారు అంటూ ఎద్దేవా చేశారు.ఇన్నాళ్లు విజయసాయి రెడ్డి చేసిన ప్రయత్నం జగన్ ను కాపాడేందుకు అనుకున్నామని, కానీ జగన్ కుర్చీ లాక్కోవడానికి పెద్ద ప్లానే వేశారని వెంకన్న ట్వీట్ చేశారు.16 సంవత్సరాల జైలు శిక్షలో 16 నెలలు పోతే ఎంత విజయసాయి రెడ్డి గారు ..మీరే చెప్పాలి లెక్కల మాస్టారు అంటూ సెటైర్ వేశారు. బుద్దా వెంకన్న ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.యవాదులు.