పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 29 నుంచి సమావేశాలు మొదలవుతుండగా.. 30న అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ప్రధాని అధ్యక్షతన వర్చువల్ ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు అన్ని పార్టీలకు ఆహ్వానం పంపనుంది.
మరోవైపు ఈసారి రెండు విడతలుగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. తొలి దఫాలో ఈ నెల 29న ప్రారంభమై ఫిబ్రవరి 25 వరకు, రెండో దఫాలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 8వరకు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఇక గతంలోలానే ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ సమావేశం కానుంది.ఇక ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఇక సమావేశాలకు రెండు రోజుల ముందే సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.