కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా లోక్ సభలో ఆమె మాట్లాడుతూ ప్రసంగంలో ఓ ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా పలికారు. దీంతో సభలో నవ్వులు విరపూశాయి. వెహికల్ స్క్రాపింగ్ గురించి ఆమె ప్రకటన చేశారు.
పాత కలుషిత వాహనాలు(ఓల్డ్ పొల్యూటెడ్ వెహికల్స్)ను రిప్లేస్ చేస్తున్నామని చెప్పబోయి దానికి బదులుగా ఓల్డ్ పొలిటికల్ అన్నారు. వెంటనే నాలుక్కరుచుకుని వెంటనే స్వారీ చెప్పారు. ఓల్ట్ పొల్యూటింగ్ వెహికల్ అని సవరించారు. ఓ పదం బదులు మరో పదం వాడటంతో విపక్ష సభ్యులు నవ్వేశారు.
వెహికిల్ రిప్లేస్‌మెంట్ పాలసీ అనేది అతిముఖ్యమైన విధానమని ఆమె పేర్కొన్నారు. ఇంగ్లీషులో తప్పుగా పలికిన పదాన్ని గుర్తించి వెంటనే చిరునవ్వు నవ్వారు. మళ్లీ దాని బదులు పొల్యూటింగ్ పదాన్ని వాడారు. పర్యావరణ పరిరక్షణ విధానంలో భాగంగా వెహికిల్ స్క్రాపింగ్ విధానాన్ని తీసుకు వచ్చినట్టు చెప్పారు.
ఇది ఇలా వుంటే బడ్జెట్ పై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. దేశంలో ప్రజలకు ఆదాయమే సరిగా లేదని మండిపడ్డాయి. అలాంటప్పుడు మినహాయింపులతో వారికి ఎలాంటి లబ్ది చేకూరుతుందని ఫైర్ అయ్యాయి. బడ్జెట్ పార్టీ కోసం కాకుండా దేశం కోసం రూపొందిస్తే బాగుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.