తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకుల్లో ముందు వరుసలో ఉండే డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి మూవీ తర్వాత రాజమౌళి స్టార్ డం అంతా ఇంతా కాదు. పైగా తన నెక్ట్స్ సినిమాపై ఉన్న అంచనాలకు తోడు మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్. ఇంకేముంది సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా భారీ బడ్జెట్ సినిమా కూడా.
అయితే, కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవటంతో రిలీజ్ డేట్ పోస్ట్ అయ్యింది. 2021 సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన మూవీ… ఎప్పుడు రిలీజ్ అయితుందో చెప్పలేని పరిస్థితికి వెళ్లిపోయింది. అనధికారిక సమాచారం ప్రకారం సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరిగింది.
అయితే, ఇప్పటికే బడ్జెట్ పెరిగిపోతుండటంతో నిర్మాత డీవీవీ నుండి ఫైనాన్షియల్ ప్రెషర్స్ పెరిగిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమా షూట్ ను మార్చి వరకు పూర్తి చేయాలని జక్కన్న డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక కరోనా లాక్ డౌన్ సమయంలోనే మొదలుపెట్టిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను షూటింగ్ తో సమాంతరంగా చేయాలని… 2021 దసరాకే సినిమా రిలీజ్ కు రెడీ చేయాలని డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ టాక్.
నిర్మాత కష్టాలను తీర్చేందుకు జక్కన్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.