2023-2024 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. సోమవారం పుదుచ్చేరిలో ఉన్న ఆమె… మంగళవారం ఉదయమే బడ్జెట్‌ని ఆమోదించినట్లు తెలిసింది. గ్రీన్ సిగ్నల్ రావడంతో.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
ఐతే.. సోమవారం హైకోర్టులో చెప్పిన ప్రకారం.. ఈసారి గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభం అవుతాయి. ముందుగా అనుకున్నట్లుగానే.. ఫిబ్రవరి 3న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. కానీ బడ్జె్ట్‌ని మాత్రం ఫిబ్రవరి 6న ప్రవేశపెడతారు. ఈసారి 3 లక్షల కోట్ల రూపాయల అంచనాలతో బడ్జె్ట్ రూపొందినట్లు తెలిసింది.
నిజానికి ఈ నెల 21నే బడ్జెట్‌ని ఆమోదం కోసం గవర్నర్ చెంతకు పంపగా… తన ప్రసంగం ఉంటుందా లేదా అని ఆమె ప్రశ్నించగా.. దానిపై ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. దాంతో ఆమె బడ్జెట్‌ని ఆమోదించలేదు. సోమవారం హైకోర్టులో ఆమె ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం చెప్పడంతో… గవర్నర్ కూడా శాంతించారు.
ముందుగా ప్రకటించినట్టుగా మూడో తేదీన ప్రవేశా పెట్టాల్సిన బడ్జెట్‌ను ఆరో తేదీకి మార్చారు. సోమవారం సాయంత్రం పుదుచ్చేరి పర్యటన ముగించుకున్న హైదరాబాద్ తిరిగి వచ్చిన గవర్నర్ తమిళి సైని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కలిశారు. బడ్జెట్ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తరఫున గవర్నర్ ను కోరారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు రావాల్సిందిగా గవర్నర్ తమిళి సై ను ఆహ్వానించారు.
ఉభయ సభల ప్రోరోగ్, తిరిగి సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిఫారసు అంశాలపై గవర్నర్ తో చర్చించారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన స్పీచ్ కాపీని మంత్రి గవర్నర్ కు అందించారు. పెండింగ్ బిల్లుపై చర్చకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
రాజ్ భవన్ , ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగిన క్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గవర్నర్ ను కలిసి చర్చించడం ఆసక్తికరంగా మారింది. గతంలో రెండుసార్లు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావించినా చివరికి ఆ నిర్ణయాన్ని మార్చుకుంది ప్రభుత్వం. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ ఉంటుందని తెలిపింది.
ఈ మేరకు గవర్నర్ ను బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది. ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, 3వ తేదీ మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 6న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.