నేటి నుండి ఈ నెల 15 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బీఏసీ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సీఎల్పీ భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
ఈనెల 8, 13 వ తేదీల్లో అసెంబ్లీ సెలవు ఉంటుందని బీఏసీ ప్రకటించింది. అయితే.. మరిన్ని ఎక్కువ రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని మజ్లిస్, కాంగ్రెస్ సభ్యులు కోరారు. కానీ.. ప్రభుత్వం మాత్రం 7 రోజుల పాటు నిర్వహణకే మొగ్గు చూపింది.
ఈ మేరకు మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. వివిధ శాఖలకు గానూ… మొత్తం రాష్ట్రంలో రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
బడ్జెట్ లో కేటాయింపులు ఇలా…
– దేశంలో తెలంగాణ టార్చ్ బేరర్
– కేసీఆర్ పథకాలు మెచ్చిన ప్రజలు.. ఆయన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు
– తెలంగాణ దేశంలో అగ్రగామిగా రూపుదాల్చింది
– సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అగచాట్లు పడింది
– రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్
– రెవెన్యూ వ్యయం – రూ.1.89 లక్షల కోట్లు
– క్యాపిటల్ వ్యయం – రూ.29,728 కోట్లు
– వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు
– దళితబంధుకు రూ.17,700 కోట్లు
– ఆసరా పెన్షన్లకు రూ.11,728 కోట్లు
– ఎస్టీల సంక్షేమానికి రూ.12,565 కోట్లు
– కళ్యాణ లక్ష్మ, షాదీ ముబారక్ కు రూ.2,750 కోట్లు
– పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు
– పంట రుణాలు రూ.16,144 కోట్లు మాఫీ
– డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రూ.12,000 కోట్లు
– మన ఊరు-మన బడి రూ.7,289 కోట్లు
– బీసీ సంక్షేమం కోసం రూ.5,698 కోట్లు
– పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు
– బ్రహ్మణుల సంక్షేమం కోసం రూ.177 కోట్లు
– హరిత హారం పథకానికి రూ.932 కోట్లు
– రూ.75 వేల లోపు పంట రుణాలు మాఫీ
– రూ.50 వేల లోపు రైతు రుణాలు ఈనెల చివరిలోపు మాఫీ
– పామాయిల్ సాగుకు రూ.1,000 కోట్లు
– 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం
– అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు
– రాబోయే రెండేళ్లలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
– కొత్త వైద్య కళాశాలలకు రూ.1,000 కోట్లు
– రోడ్లు, భవనాల కోసం రూ.1,542 కోట్లు
– ప్రతినెలా గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం రూ.227.5 కోట్లు విడుదల
– రూ.1,547 కోట్ల వ్యయంతో వైకుంఠధామాల నిర్మాణం
– మరణించిన నేతన్న కుటుంబానికి రూ.5 లక్షల బీమా
– గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో పథకం
– తలసరి ఆదాయం వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
– రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 86 శాతం అధికం
– 2021-22లో రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధిరేటు 18.8 శాతం
– 2021-22లో జాతీయ వృద్ధిరేటు 18.1 శాతం