టీడీపీ నేత బుద్ధా వెంకన్న
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నా.. జగన్ కు అప్పుడే ఓటమి భయం పట్టుకుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను పిలిచేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. కేబినెట్ భేటీలో ప్రజల గురించి కాకుండా పీకే రంగప్రవేశంపైనే చర్చ జరిగింది. పీకే కాదు పైనుంచి తాత రాజారెడ్డి దిగొచ్చినా ఈసారి టీడీపీ విజయాన్ని ఆపడం ఎవరితరం కాదు.
రాష్ట్రంలో విద్యార్థులు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు మళ్లీ ఎప్పుడు అధికారంలోకి వస్తారన్న అంశంపైనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే సామర్థ్యం ఆయనకు తప్ప ఇంకెవరికీ లేదు. నవరత్నాల పేరుతో మోసం చేశారు. వైసీపీ మాటలు నమ్మి ఇంకోసారి మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.