డిస్కో కింగ్ బప్పి లాహిరి ముంబైలోని క్రిటికేర్ ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే భారతదేశంలో డిస్కో సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు బప్పి లాహిరి.
కాగా బప్పి మృతిపై పలువురు సినీరాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అయితే బప్పి అంత్యక్రియలను లాస్ ఏంజెల్స్ నుండి అతని కుమారుడు బప్పా లాహిరి రాకతో రేపు ముంబైలో నిర్వహించనున్నారు.
ఇక నవంబర్ 27, 1952న పశ్చిమ బెంగాల్‌లో జన్మించారు బప్పి లాహిరి. అనేక భారతీయ భాషల్లో 500+ సినిమాల్లో 5,000 పాటలకు సంగీతం అందించారు.