ప్రముఖ భారతీయ సింగర్, గేయరచయిత బప్పి లాహిరి ఫిబ్రవరి 15, 2022 మంగళవారం జుహులోని క్రిటికేర్ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
అయితే అతని కుమారుడు బప్పా లాహిరి లాస్ ఏంజిల్స్ నుండి గురువారం మధ్యాహ్నం రావటంతో విలే పార్లే శ్మశానవాటికలో బప్పి అంత్యక్రియలు జరిగాయి.
లాహిరి ఒక నెల నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారు. కాగా సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. కానీ మంగళవారం అతని ఆరోగ్యం క్షీణించింది. ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులు ఇంటికి రమ్మని డాక్టర్‌ను పిలిచారు. అతన్ని అనంతరం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు.
అయినప్పటికీ బప్పి మృతి చెందారు. బప్పి కి అభిమానులు, కుటుంబ సభ్యులు ఆఖరి సారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. అందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.