స్టాక్ మార్కెట్లపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రభావం క్లియర్ గా తెలుస్తోంది. కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వేతో సోమవారం లాబాల్లో ముగిసిన మార్కెట్ ఇప్పుడు కూడా అదే ఊపుకొనసాగిస్తోంది. ఈ రోజు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సెన్సెక్స్ 700 పాయింట్ ప్లస్ తో మొదలైంది.
ఓ దశలో 900 పాయింట్లు పెరిగి ఇప్పుడు 650 పాయింట్ల లాభంతో 58 వేల 666 వద్ద ట్రేడవుతోంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ నిఫ్టీ కూడా నిఫ్టీ 240 పాయింట్లు పెరిగి 17వేల 340 వద్ద కొనసాగుతోంది. కేంద్ర ప్రవేశ పెడుతున్న బడ్జెట్ మార్కెట్లకు సానుకూలంగా మారాయి.
ఆర్థిక సర్వేతో మార్కెట్ సూచీలు పెరగడంతో.. మదుపర్ల సెంటిమెంట్ మరింత బలపడింది. కరోనాతో అస్తవ్యస్తంగా తయారైన ఆర్థిక పరిస్థితి ఈ బడ్జెట్ తో కేంద్రం గాడిన పెడుతోందని మదుపర్లు భావిస్తున్నారు. దీనికి తోడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు బడ్జెట్ ను ఓ అంచనా వేసి మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నారు.
దీంతో.. సూచీలో పరుగుల తీస్తున్నాయి. ఆర్థిక సర్వే ప్రభావంతో సోమవారం ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా షేర్ల విలువ పెరిగింది.