సై సినిమాలో విలన్ ని ఏడిపించడానికి హీరో అండ్ గ్యాంగ్ రాత్రికి రాత్రే తలుపు ముందు గోడ కడతారు. అచ్చం అలాంటి ఘటనే ఒకటి వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గోపాల్ పెట్ మండలం తాడిపత్రి గ్రామంలో పత్తికొండ లక్ష్మీ , కేరెడ్డి దంపతులు మూడు సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ఆఫ్ లైన్ అనుమతితో ఇల్లు కట్టుకున్నారు.
ఆ ఇంటికి గ్రామ పంచాయితీ అనుమతి ప్రకారం ఇంటి బిల్లు.కరెంటు బిల్లు మంచినీటి బిల్లు లు కడుతున్నారు. అయినప్పటికీ ఇంటి ముందు వారు స్థలం మాది అంటూ గత కొంత కాలంగా వేధించసాగారు. లక్ష్మి భర్త గత కొన్ని రోజుల క్రితం కేరెడ్డి దంపతులు మరణించడంతో లక్ష్మి మిషన్ కుట్టుకుంటు కూతురిని చదివించుకుంటోంది.
పెద్ద దిక్కు లేరని గ్రహించిన ఇంటి ముందు ఉన్న వారు ముందు ఉన్న స్థలంలో మీరు నడవకూడదు అని గేటుకు అడ్డంగా రాత్రికి రాత్రే ప్రహరీ గోడను నిర్మించారు. లక్ష్మి గ్రామస్థుల సాయంతో సర్పంచును సంప్రదించగా ఆయన ఇది సరైన పద్దతి కాదని ఆయన హెచ్చరించడం జరిగింది. దీంతో సందీప్ అనే వ్యక్తి ఈ స్థలం మాది మా తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆస్తులు. ఈ ఇంటి స్థలం మా పేరు మీదే ఉంది తెలిపారు.
దాంతో పాటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదుగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీఓ పంచాయతీ కార్యదర్శి సమక్షంలో డీఎల్పీఓ విచారణ పూర్తి చేసి నివేదిక పంపారు.గత నెల 31న డీఎల్పీఓ నివేదిక ప్రకారం ఇంటి నిర్మాణం ప్రభుత్వ అనుమతి లేకుండా జరిగిందని నివేదికను ఇచ్చారు. ప్రస్తుతం ఇదే గ్రామంలో 250 ఇళ్లకు పైగా ఆఫ్ లైన్ అనుమతులతోనే ఇళ్లను నిర్మించారు.
మరి వాటికి అన్నింటికి లేని సమస్య ఆ ఒక్క మహిళ ఇంటికి మాత్రమే రావడంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పండుగ నాడు కనీసం గుమ్మం కూడా చూడకుండా చేశారంటూ ఆ కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.