యాదాద్రిలో విషాదం నెలకొంది. ఓ పాత భవనం ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
ఈ ఘటనలో ఇంకా పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు అంతస్తుల భవనంలో వ్యాపారం నిర్వహించే షాపులు, నివాస గృహాలు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే అధికారులు, పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. కూలిన భవనం 30 ఏళ్ల క్రితం నాటిదని చెబుతున్నారు.